Karthika Deepam2 : సుమిత్రకి నిజం చెప్పేసిన జ్యోత్స్న.. తనపై కోప్పడ్డ శివన్నారాయణ!
on Jan 10, 2026

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -563 లో..... సుమిత్ర గురించి దీప బాధపడుతుంటే కార్తీక్ వచ్చి దైర్యం చెప్తాడు. నేను అమ్మకి నిజం చెప్తాను.. జ్యోత్స్న కన్నకూతురు కాదని అని దీప అనగానే వద్దు ఇప్పుడు అత్తయ్య పరిస్థితి చూసావా ఈ టైమ్ లో వద్దని కార్తీక్ అంటాడు. మరొకవైపు జ్యోత్స్న, పారిజాతం మాట్లాడుకుంటారు. అసలు కార్తీక్ కి.. నువ్వు అసలైన వారసురాలివి కాదని తెలిసి ఉంటుందని పారిజాతం అనగానే జ్యోత్స్న భయపడుతుంది.
నీకెలా తెలుసని జ్యోత్స్న అనగానే రోజు సాయంత్రం టైమ్ కి వెళ్ళేటోడు.. అలాంటిది నీపై దృష్టి పెట్టి ఇంటికి కాపలా ఉన్నాడని పారిజాతం అంటుంది. అసలు బావ ప్లాన్ ఏంటి అని జ్యోత్స్న అనుకుంటుంది. మరుసటిరోజు దీప, కార్తీక్ శివన్నారాయణ ఇంటికి బయల్దేరతారు. అత్త ముందు జాగ్రత్తగా ఉండమని దీపకి కార్తీక్ చెప్తాడు. ఆ తర్వాత శ్రీధర్ ఎంట్రీ ఇస్తాడు. మీరేంటి ఇక్కడ అని కార్తీక్ అనగానే నేనే రమ్మన్నాను.. వదినని చూడడానికి వెళ్తానని కాంచన అంటుంది. పెద్ద ప్లానే.. మీరు దీపని కార్ లో తీసుకొని వెళ్ళండి. నేను మిమ్మల్ని ఫాలో అవుతానని కార్తీక్ అంటాడు.
అ తర్వాత మమ్మీకి నిజం చెప్పాలని అనుకుంటున్నా గ్రానీ.. తనకి బ్లడ్ కాన్సర్ అని చెప్పేస్తా.. భయంతో మమ్మీ ఉండదు. మనం సేఫ్ అని జ్యోత్స్న అనగానే పారిజాతం తన చెంపచెల్లుమనిపిస్తుంది. అలా చేయడం తప్పు అని పారిజాతం అంటుంది. అయిన పారిజాతాన్ని జ్యోత్స్న కన్విన్స్ చేస్తుంది. జ్యోత్స్న, పారిజాతం ఇద్దరు సుమిత్ర దగ్గరికి వెళ్తారు. సుమిత్రకి జ్యోత్స్న టాబ్లెట్ ఇచ్చి తనతో మాట్లాడుతుంది. మమ్మీ నీకు బ్లడ్ కాన్సర్.. ఆ విషయం ఇంట్లో వాళ్ళు చెప్పలేకపోతున్నారని అంటుంది. కానీ సుమిత్ర అదేం వినకుండా పడుకుంటుంది. ఛీ ఇప్పటివరకు చెప్పింది అంతా వట్టిదేనా అని జ్యోత్స్న అనుకుంటుంది. అదంతా శివన్నారాయణ, దీప కార్తీక్, కాంచన వింటారు. కాసేపటికి జ్యోత్స్నపై అందరు కోప్పడుతారు. అ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



